.webp)
సీరియల్ యాక్టర్ గా, బిగ్ బాస్ లో ఒక ఆర్మీని సంపాదించుకున్న వ్యక్తిగా కౌశల్ అందరికీ సుపరిచితుడే. ఇప్పుడు కౌశల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు. అలాగే ఒక కొత్త న్యూస్ ని తన ఫాన్స్ తో షేర్ చేసుకున్నాడు.
"ప్రతి కలకు ఒక ఆరంభం ఉంటుంది. ఇప్పుడు నా కలను నిజం చేసుకునే దిశగా మరో అందమైన అడుగు వేస్తున్నాను. అదే కౌశల్ 2.0 . కొత్త ఆశలు, అంతులేని ఉత్సాహం, చెదరని సంకల్పంతో నా ప్రయాణం మరోసారి మొదలవుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న "ది లుక్స్ మోడలింగ్ అకాడమీ" వేదికగా నా కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఈ కొత్త ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించాం. అమ్మవారి ఆశీస్సులతో మా కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ప్రార్థించాం. త్వరలోనే ఈ కొత్త ప్రాంగణంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇది కేవలం ఒక ఆఫీసు మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్ల కలలకు, కష్టానికి, అంకితభావానికి, కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే నా తపనకు ప్రతిరూపం. ఇది కేవలం ఒక అకాడమీ కాదు.. నా కల సాకారమవుతున్న క్షణం! చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం, పిల్లలు, టీనేజర్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రోత్సహించడం, మోడలింగ్ రంగంలోకి రావాలనుకునే వారికి సరైన శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం. తమలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే వారికి సరైన వేదికను అందించాలనుకుంటున్నాం.
భవిష్యత్తులో ప్రతిభావంతులైన చిన్నారులు, యువత, మోడల్స్‌ను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించడం నా ప్రధాన లక్ష్యం. వారి కలలకు సరైన దిశను చూపించి, పెద్ద వేదికలపై తమ సత్తా చాటుకునేలా ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఇది కొత్త ఆరంభం.. సరికొత్త ఆలోచన.. కొత్త ఉత్సాహం.. ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించే కొత్త గమ్యం!కౌశల్ 2.0.. కల కొనసాగుతుంది.. లక్ష్యం ఇంకా ఇంకా విస్తరిస్తుంది.. అమ్మవారి ఆశీస్సులతో ఈ కొత్త అధ్యాయం ఎంతోమందికి కొత్త అవకాశాలను అందిస్తుందని, ఎంతోమంది కలలను నిజం చేసే వేదికగా నిలుస్తుందని నమ్ముతున్నాను. నవరాత్రి ఆశీస్సులు.. కొత్త ప్రారంభాలు.. మరింత పెద్ద కలలు! ది లుక్స్ మోడలింగ్ అకాడమీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ — కలలకు అవకాశాలు కలిసే వేదిక!"అంటూ మోడలింగ్ మీద ఇంటరెస్ట్ ఉన్న ప్రతీ ఒక్కరి కోసం ఒక గుడ్ న్యూస్ ని చెప్పాడు.




.webp)
.webp)
